వేద న్యూస్, ఖమ్మం: 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆపేది లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ..గత పాలకుల హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లో జరిగిన అవినీతి పైన అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర రాజశేఖర్, జొన్నలగడ్డ రవికుమార్, కూసుమంచి మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.