• కపూర్ నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
  •  తమ ఎమ్మెల్యే, మంత్రి పొన్నంకు జనం కృతజ్ఞతలు

వేద న్యూస్, హుస్నాబాద్:
తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామ ప్రజానీకానికి ఇచ్చిన మాటను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలబెట్టుకున్నారు. వివరాల్లోకెళితే..అక్కన్నపేట మండలం కపూర్నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని పొన్నం ప్రభాకర్ దృష్టికి జనం తీసుకెళ్లగా సానుకూలంగా మంత్రి స్పందించారు. బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీని గురువారం నెరవేర్చి తండా వాసుల కల సాకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కపూర్నాయక్ తండాకు బస్సు సౌకర్యం కల్పించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సమస్యను పరిష్కరించడం చాలా సంతోషకరమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తండా వాసులంతా కల సాకారం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు బండి కుమార్, బుర్ర ప్రభాకర్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బానోతు భాస్కర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్న రాజు, వాసాల లింగయ్య, గుగులోతు రాజు నాయక్, బైరగొని శ్రీనివాస్ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, నాయకులు వీరన్న,అనిల్ నాయక్, లింగాల స్వామి, జగ్గారెడ్డి, హాట్యా నాయక్, హర్య నాయక్, వంగపల్లి రాజు, మోహన్ లతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.