వేద న్యూస్, హుస్నాబాద్:
శనివారం హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటలకు చిగురుమామిడి మండలంలో సుందర గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అనంతరం చిన్న ముల్కనూర్తో పాటు హుస్నాబాద్ లో స్థానిక ఆలయాలను దర్శించుకోనున్నారు.
ఆ తర్వాత భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారు. ఆ వెంటనే ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ లోని లక్ష్మీ గార్డెన్స్ లో క్రిస్టమస్ వేడుకలకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుగు ప్రయాణం అవుతారని మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.