- మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ‘శ్రీరామా సినిమాస్’ ఓపెనింగ్
వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి:
వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్….నేడు(సోమవారం) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గట్టెపల్లి రోడ్‌లో ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ &కామర్స్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
సుల్తానాబాద్ లో ప్రారంభమయ్యే మొట్ట మొదటి మల్టీప్లెక్స్ ‘శ్రీరామ సినిమాస్’. కాగా, ఈ ప్రారంభోత్సవానికి మంత్రితో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు తానిపర్తి భాను ప్రసాద్, ఎల్.రమణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు పాల్వాయి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేశ్ గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బిరుదు రాజమల్లు, మండల పరిషత్ సభ్యులు పొన్నమనేని బాలాజీ రావు, సుల్తానాబాద్ జిల్లా పరిషత్ సభ్యులు మినుపాల స్వరూప ప్రకాశ్ రావు, సుల్తానాబాద్ 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చింతల సునీత రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు ‘శ్రీరామ సినిమాస్’ భాగస్వాములు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినోద ప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ‘శ్రీరామ సినిమాస్’ భాగస్వాములు ప్రత్యేకంగా కోరారు.