వేద న్యూస్, రుద్రూర్ :
రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే అజయ్ కుమార్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే కాంతాబాయి ఈ నెల 4వ తేదీన కోపర్గ గ్రామానికి పొలం పనికి వెళ్ళగా, సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు అజయ్ కుమార్ ఇంట్లో లేడని, తిరిగి ఇంటికి రాకపోయేసరికి రెండు ఫోన్ లకు కూడా సంప్రదించగా, ఫోన్ లు స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఆ రోజు నుండి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో సోమవారం రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, తల్లి మోరే కాంతాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.