Oplus_131072

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్ లోని ఓ వాహనం పల్టీ కొట్టి ఎమ్మెల్యే కి పెను ప్రమాదం తప్పింది.నల్గొండ జిల్లా గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.గుర్రంపోడు మండలం వద్దిరెడ్డి గూడెం వద్ద ఘటన జరగగా కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోఇద్దరి వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.