వేద న్యూస్, వరంగల్:

దసరా ఉత్సవ  సమితి కాశీబుగ్గ అధ్యక్షులు ధూపం సంపత్ , సమితి సభ్యుల ఆధ్వర్యంలో రావణావధ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి రావణాసుర వధ కు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసినందుకు ఉత్సవ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా వరంగల్ నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.

గత సంవత్సరం నుండి చిన్న వడ్డపల్లి చెరువు ప్రాంతంలో సద్దుల బతుకమ్మకు దసరా ఉత్సవాలకు పది ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరం రూ.46 లక్షలతో అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి , వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, ఉత్సవ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, బాంబుల కుమార్, 14 వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, 19 డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్, 18వ డివిజన్ కార్పొరేటర్ వాస్కుల బాబు, 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేష్, ఆర్టిఏ మెంబెర్ గోరంటల మనోహర్, గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా, సిలువేరు థామస్, గోరంటల రాజు, వేముల నాగరాజు, దుబ్బ శ్రీనివాస్, సిలువేరు శ్రీనివాస్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.