•  ఉద్యమకారులను అక్కున చేర్చుకున్న ఉద్యమాకారుల ఆత్మ బంధువు కాంగ్రెస్ పార్టీ
  • తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్

వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ పట్టనానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి, టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాంను తెలంగాణ ఉద్యమాకారులు అన్నం ప్రవీణ్ బృంద సభ్యుల అధ్వర్యంలో ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమాకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు.

తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను ఏకం చేసి జేఏసీ ఏర్పాటుతో యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏకతాటి పైకీ తెచ్చి తెలంగాణ వాదనను కేంద్ర ప్రభుత్వానికి తెలుపడంలో కీలక గొంతుగా నిలబడ్డ ఉద్యమ స్పూర్తి ప్రొఫెసర్ కోదండరామ్ అని పేర్కొన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమాకారులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అన్నం ప్రవీణ్ వెల్లడించారు. తెలంగాణ అమరవీరుల, ఉద్యమాకారుల, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం,బీఆర్ఎస్ పార్టీ, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమాకారులను అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

నియంత పాలన కొనసాగించింది., కానీ ఇప్పుడు ప్రజా తీర్పుతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాకారుల పక్షపాతి‌గా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి గొప్పగా గౌరవించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నం ప్రవీణ్ వివరించారు.

తెలంగాణకు రక్షణ కవచంగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనీ, తెలంగాణ ఉద్యమాకారులంతా కాంగ్రెస్ పార్టీకీ అండగా నిలబడాలని అన్నం ప్రవీణ్ కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమాకారులు అన్నం ప్రవీణ్, విద్యార్థి నాయకులు కారింగుల రాజేందర్, బుడిగే శ్రీకాంత్, యేబూషి అజయ్, ఇటుకాల గణేష్, బిజిగిరి శ్రీకాంత్, కార్తీక్, సాయి, ప్రశాంత్, దీపక్, బాను, దిలీప్, సన్ని తదితరులు పాల్గొన్నారు.