- ఎయిర్ పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్ల నిర్మాణం
- రూ.4.50 కోట్లతో తనుగుల-విలాసాగర్ అండర్ పాస్ నిర్మాణ పనులు
- బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
వేద న్యూస్, జమ్మికుంట:
భారతదేశ రైల్వే ముఖచిత్రాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మార్చిందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎయిర్ పోర్ట్ లకు ధీటుగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోందని ఆయన వెల్లడించారు.1,500 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ ల నిర్మాణాల కోసం దాదాపు రూ.41 వేల కోట్ల నిధులు కేటాయించారని స్పష్టం చేశారు.
జమ్మికుంట మండలంలోని తనగుల -విలాసాగర్ అండర్ పాస్ పనులు నాలుగున్నర కోట్ల తో నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం లో భాగంగా చేపడుతున్న రైల్వే స్టేషన్ల, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ నిర్మాణ అభివృద్ధి పనులను దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా జమ్మికుంట మండలంలోని తనుగుల, విలాసాగర్ అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైల్వే ను ఎంతో ఆధునికరిస్తోందని చెప్పారు. ప్రయాణికుల కోసం బుల్లెట్ రైలు, వందే భారత్ రైళ్లు తీసుకువచ్చిన ఘనత మోడీ ప్రభుత్వం దేనని వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ను ఆధునికరించడానికి మోడీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. భారత్ అమృత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని 554 రైల్వే స్టేషన్లను మాడ్రన్ గా తీర్చిదిద్దుతూ, ఆధునికరిస్తున్నారని తెలిపారు. తనగుల -విలాసాగర్ అండర్ పాస్ నిర్మాణం వల్ల రవాణాకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారి మనోజ్ కుమార్ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, నియోజక వర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు జీడి మల్లేష్, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, హుజురాబాద్ మండల అధ్యక్షుడు రాముల కుమార్, ఇల్లందకుంట వైస్ ఎంపీపీ ఆరెల్లి జోష్న- శ్రీనివాస్, గండ్రపల్లి ఎంపీటీసీ తోట కవిత-లక్ష్మణ్, మాజీ సర్పంచ్ రావుల సంపత్, గరుకుంట్ల సాంబయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ మహ్మద్ షఫీ, స్థానిక బీజేపీ నాయకులు పుల్లురి ఈశ్వర్,రాచపల్లి వెంకటేష్, సమిండ్ల విజేందర్, స్థానిక గ్రామాల నాయకులు బల్గురి సమ్మారావు, చిలుమల రామస్వామి, పోల్సాని వెంకట్ రావు, మధారపు లింగారావు తదితరులు పాల్గొన్నారు.