వేద న్యూస్, జమ్మికుంట:
బిడ్డకు తల్లి అందించే అమృతం ముర్రుపాలు అని ఐసీడీఎస్ సూపర్‌వైజర్, అంగన్‌వాడీ టీచర్లు తల్లులకు అవగాహన కల్పించారు. తల్లిపాల వారోత్సవాలు వీణవంక మండల పరిధిలోని కొండపాక అంగన్ వాడీ  కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు.

పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,  రెండేండ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలని  తల్లులకు సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమాదేవి, అంగన్ వాడీ  టీచర్స్ మాధవి, మల్లేశ్వరి,హెల్పర్లు, కార్యదర్శి పల్లె దవాఖాన డాక్టర్ జయంతి ఆశాలు పాల్గొన్నారు.