- ఆరె కుల బాంధవులకు ఆ సంఘం నాయకుల పిలుపు
వేద న్యూస్, ధర్మసాగర్:
ఓబీసీ సర్టిటిఫికెట్ కోసం ‘ఓబీసీ సాధన సభ’కు నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు తరలిరావాలని ఆరె కుల సంఘ సభ్యులు కోరారు. ఈ సభకు జనసమీకరణ కోసం ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గ్రామంలో ఆ గ్రామ సంఘం అధ్యక్షులు లింగంపల్లి చిరంజీవి అధ్యక్షతన బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 3న(శనివారం) హైదరాబాద్ లో నిర్వహించే ‘ఓబీసీ సాధన సభ’కు ప్రతీ ఇంటి నుంచి విధిగా ఒకరు హాజరు కావాలని ఆరె సంఘం నాయకులు కోరారు. తద్వారా ఓబీసీ సర్టిఫికెట్ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవొచ్చని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, అవేలి శ్రీనివాస్, ధర్మసాగర్ మండల ఆరె సంఘం అధ్యక్షులు మోరే మహేందర్, మండల నాయకులు గ్యారంపల్లి యుగేందర్, మోరే రాజేందర్, గ్రామ శాఖ కోశాధికారి హింగే అనిల్, సహాయ కార్యదర్శి సంగెకారి యువరాజు, కార్యవర్గ సభ్యులు వలిగే రమేష్, సంగేకారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.