•  ప్రజలకు  భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్ పరిశీలకులు జీఎస్ఆర్ పిలుపు

వేద న్యూస్, ఆసిఫాబాద్‌:
ఈనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు రానున్నారని, ఈ సభకు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిశీలకులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్ఆర్) పిలుపునిచ్చారు.

గురువారం ఆయన ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూరు మండల కేంద్రాల్లో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో జీఎస్ఆర్ మాట్లాడుతూ సీఎం గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంద్రవెల్లి వేదికగా అమరులకు నివాళులర్పించి, ఆభివృద్ధిని ఒక ఉద్యమంలా తీసుకెళ్లేందుకు వస్తున్నారన్నారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులే నేటికీ గ్రామాలల్లో దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఆరుగ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని నాయకులకు పిలుపునిచ్చారు.నియోజకవర్గ పరిధిలోనిమొత్తం 10 మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అజ్మిరా శ్యామ్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, ఎన్ఎస్సార్ సంపత్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్ హమద్, ఆదివాసి నాయకుడు పెందూరి గోపి తదితరులు పాల్గొన్నారు.