వేద న్యూస్, వరంగల్ :
బీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ టికెట్‌ను తెలంగాణ పోరాట యోధుడు ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపెల్లి శ్రీనివాస్‌కు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ సికేం కాలేజీ జంక్షన్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి హాజరై మాట్లాడారు. నిరంతరం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికోసం పాటుపడే నాయకుడు వంగపెల్లి శ్రీనివాస్ అని అన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఘనత వంగపెల్లికే ఉందని అన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు టికెట్ వంగపల్లి శ్రీనివాస్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా నాయకులు వేల్పుల దయాకర్ మాదిగ, మేకల కరుణాకర్, కడారి అనిల్,బర్తపురం ప్రసాద్, పోలేపాక దాస్, గిన్నారం జయరాజ్,రాజ్ కుమార్, ప్రవీణ్,ప్రభాకర్,రాములు,లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.