- మరిపెడ మండల విద్యాశాఖ అధికారి గాదె అనితాదేవి
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మండలంలో ఎల్టా మరిపెడ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎజుక్వెస్ట్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పరీక్షలు మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని గాదె అనిత దేవి మరియు ఎల్టా మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బయగాని రామ్మోహన్ సంయుక్తంగా ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. తదుపరి ముఖ్య అతిథి విద్యార్థుల ప్రసంగాలు మరియు రాత పరీక్షలను పరిశీలించారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ విద్యార్థినీ విద్యార్థులను ఆంగ్లంలో నిష్ణాతులుగా తయారు చేయాలని దానికి తగిన విధంగా వారికి శిక్షణను అందజేయాలని కోరారు.
ఉపాధ్యాయులు చెప్పే అంశాలను విద్యార్థులు జాగ్రత్తగా నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. గురువారం నిర్వహించిన పోటీలలో జిల్లా పరిషత్, గవర్నమెంట్ పాఠశాలల విభాగం నుండి జూనియర్స్ లో నర్మదా జడ్పిహెచ్ఎస్ ఎల్లంపేట, సీనియర్ విభాగంలో వైష్ణవి, ఎజుక్వెస్ట్ జూనియర్ ఐశ్వర్య సీనియర్ లిఖిత జెడ్ పి హెచ్ ఎస్ గుండెపుడి లు విజేతలుగా నిలిచారు.
మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలల నుండి హర్షవర్ధన్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ జూనియర్స్ లో హర్షవర్ధన్, సీనియర్ నుండి నాగేశ్వరి, ఎజుక్వెస్ట్ జూనియర్ దేవి విజ్ఞత, సీనియర్ అస్మిత లు మోడల్ స్కూల్ మరిపెడ విజేతలుగా నిలిచారు.
విజేతలకు సర్టిఫికెట్లు మరియు సీల్డ్స్ బహుకరించడం జరిగింది. విజేతలందరూ కూడా డిసెంబర్ 18, 2025 న మహబూబాబాద్ లో జిల్లాస్థాయి పరీక్షలలో పాల్గొనాలని మహబూబాబాద్ జిల్లా ఎల్టా జనరల్ సెక్రెటరీ బయగాని రామ్మోహన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర కౌన్సిలర్ ఆంతోని డిసౌజా, మరిపెడ కన్వీనర్ మంగు, కో కన్వీనర్ మల్లన్న, గైడ్ టీచర్లు దేవుల, నెహ్రూ, మర్రెడ్డి, లింగ నాయక్, లచ్చిరామ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ విజేతలను అభినందించారు