- ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ
వేద న్యూస్, హన్మకొండ :
ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరుగు 1000 గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం ఈ నెల 19న హనుమకొండ జిల్లా కేంద్రంలో జరుగు సన్నాహక ప్రదర్శనకు మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి మాదిగ బిడ్డ డప్పు తీసుకొని అంబేద్కర్ సెంటర్ కు రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ పిలుపునిచ్చారు.
ఆదివారం లస్కర్ సింగారంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన డప్పుల ప్రదర్శనకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీల వర్గీకరణ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మాదిగలను మోసం చేస్తున్నందుకు నిరసనగా మాదిగల ఆవేదన ఆగ్రహం అంటే ఏంటో చూపించడానికి మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ వెయ్యి గొంతుల లక్ష డప్పుల మహా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఎస్సీల వర్గీకరణ ఆలోపు చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా మాదిగలు సంతోషంగా డప్పు కొడతారని వర్గీకరణ చేయకుండా ఇంకా మాదిగలను మోసం చేస్తే ప్రభుత్వానికి చావు డప్పు కొట్టి మాదిగల ఆగ్రహం చూపిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే సమాజంలోని కవులు కళాకారులు మేధావులు పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ హైదరాబాదులో జరుగు 1000 గొంతులు లక్షల డప్పుల ప్రదర్శనకు సంఘీభావంగా తమ మద్దతు తెలిపారని మాదిగలకు అండగా ఉంటామని వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మాదిగల పక్షాన నిలబడడానికి సమస్త సమాజం సిద్ధమైందని గుర్తు చేశారు.
ఈనెల 19న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ జిల్లా కేంద్రంలో జరుగు డప్పుల ప్రదర్శనకు విచ్చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పును చంకనేసుకుని అంబేద్కర్ కూడాలకి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాగంటి ప్రకాష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొక్క రాజేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు ఆలువాల ఎల్లెష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు భిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర రాము మాదిగ,మట్టెడ అనిల్ మాదిగ, డప్పు కళాకారుల బృందం నాయకులు కుల పెద్దలు పాల్గొన్నారు.