•  బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్

వేద న్యూస్, హైదరాబాద్:

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ విలేకరులతో మాట్లాడుతూ మన జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు కేవలం వర్షాధార వ్యవసాయాన్ని నమ్ముకొని రైతులు జీవనం కొనసాగిస్తున్నారని , అందులో ముఖ్యంగ గత సంవత్సరంలో ప్రత్తి క్వింటాలుకు పదివేల ( 10,000 ) పై చిలుకు దర ఉండటము మూలంగ ఈ సం, కూడ రైతులు అధికశాతం ప్రత్తి పంట పండించారని తెలిపారు. ఈ పంట కాలంలో మన జిల్లాలో కూడ అత్యదిక వర్షాలు మకురవడం, చీడపీడల బెడద ఎక్కువ అవడం వలన పత్తి పంట దిగుబడి పూర్తి కనిష్ట స్థాయికి పడిపోయిందని వెల్లడించారు.

పురుగు మందు దరలు ఇతరాత్ర ఖర్చులు అధికమై రైతులకు మిగులు బాటు లేక మూలిగే నక్క పై తాటిపండు పడ్డ విధంగ రైతుల పరిస్థితి తయారైందనీ పేర్కొన్నారు. జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరము కొనుగోలు ప్రారంభ సమయానికి లో ఆషాజనకంగా ప్రత్తి క్వింటాలుకు తోమ్మిది వేల రూ.9,000ల పైచిలుకు ధర ఉంచి ప్రస్తుతము రూ. 7,500 లోపు మాత్రమె చెల్లించటం వల్ల రైతులంత నిరాశవాదులై ఉన్నారు.

ఈ దర ప్రభుత్వ మద్దతు ధర రూ. కంటె అధికమైనప్పటికి పైన తెలిపిన సమస్యల కారణంగ రైతులకు గిట్టుబాటు ధర మాత్రం కాదని తెలియపరుస్తున్నాముని పేర్కొన్నారు. కావున జిల్లా కలెక్టర్ రైతుల పక్షాన ప్రభుత్వానికి తేమ పరీక్ష లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సిఫారసు చేయాలని కోరారు. కావున రైతు సమస్యలను దృష్టిలో ఉంచుకొని, సీ సీ ఐ ద్వార వాణిజ్య కొనుగోలు, ప్రయివేటు జిన్నింగుల ద్వారా కనీసం పత్తి క్వింటాలుకు రూ. 12000 వేలు వరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పురుషోత్తం, బాలేష్, బొట్టుపల్లి ప్రశాంత్, బొట్టు పెళ్లి సాయి కృష్ణ, రైతులు గోపాల్, సతీష్,అరుణ్, మహేష్, శ్రీపాల్, వెంకటేష్ తదితరున్నారు.