వేద న్యూస్, ఎల్కతుర్తి:
రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతో ముగ్గుల పోటీలు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ముందు మహిళ సంఘాలు, గ్రామపంచాయతీ సర్పంచ్ కొత్తకొండ వీరభద్ర స్వామి కార్యనిర్వాణాధికారి.., మహిళా సంఘం నాయకురాలు మహిళలు అధిక సంఖ్యలో పాలుపంచుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు.
దేవస్థానం వద్ద ఆడపిల్లలు ముగ్గులు వేసి ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టారు. కొత్తకొండ గ్రామ సర్పంచ్ సిద్దమల్ల రమా రమేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి, వీరభద్ర స్వామి దేవస్థాన కార్యనిర్వాణాధికారి, మహిళా సమాఖ్య నాయకురాలు అంగన్ వాడీ మహిళ కార్యకర్తలు కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు.

