వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందపురం గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు.శ్రీసీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో సీతారామునికళ్యాణంఅంగరంగ వైభవంగా జరిపారు. గ్రామ పురోహితులు ఆధ్వర్యంలో రామునికి ఒడుగు ధరించి వేదమంత్రాలు నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించారు.గ్రామ పంచాయితీ తాజా మాజీ గంట మల్లారెడ్డి దంపతులు సీతారామునికి పట్టు వస్త్రములు పుస్తే మెట్టెలు పూజ సామాగ్రి సమర్పించారు. సీతారాముని కళ్యాణం సందర్భంగా గంట మల్లారెడ్డి దంపతులు పెండ్లి పిఠాలపై కూర్చొని సీతారాము ల కళ్యాణం జరిపించారు.కళ్యాణం అనంతరం గ్రామస్తులు భక్తులకు పులిహోర ప్రసాదం బెల్లం మిర్యాల తో తయారు చేసిన ద్రవాన్ని భక్తులు స్వీకరించారు. సీతారాముని కళ్యాణం సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున దేవాలయానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయంత్రం డిజే చప్పుడు కోలాటం భజన బృందాల నృత్యలనడుమ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామం ఊరేగింపు శోభయాత్ర ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాముని పవిత్ర బంధాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముకుందాపురం గ్రామ పంచాయతీ ప్రజలకు సీతరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పగిడి నవీన్, కేసరి లక్ష్మారెడ్డి,గంట సురేష్ రెడ్డి, రఘురాములు,తిరుపతయ్య,జానకిరాములు,తదితరులు పాల్గొన్నారు.