వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :

పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 5:30 నిమిషాలకు మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం చిన్న మజీద్ లో నిర్వహించిన నమాజ్ లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముస్లిం సోదరులతో కలసి ప్రత్యేక నమాజ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో, ప్రతీ రోజూ ఆ అల్లానీ స్మరించుకుంటూ కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ తమ పాపాలను శుద్ధి చేసుకునే గొప్ప అవకాశమే ,ఈ పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ప్రతీ ఒక్క ముస్లిం సోదరులు అల్లా ఆశీస్సులతో వారు చూపించే సామాజిక బాటలో నడుచుకుంటూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.