• మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక
  • పెద్దపల్లి బీఆర్ఎస్‌కు పెరిగిన బలం

వేద న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి నియోజకవర్గంలో రోజురోజుకూ గులాబీ పార్టీ బలం పెరుగుతోందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి గడ్డ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండాననేని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలోని జూలపల్లి మండలానికి చెందిన నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్ రెడ్డి బుధవారం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీపార్టీలో చేరారు.

నల్ల మనోహర్ రెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. కేటీఆర్ ఇచ్చిన సలహా మేరకు నల్ల మనోహర్ రెడ్డి తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. నల్ల మనోహర్ రెడ్డి రాకతో పెద్దపల్లి గులాబీ జెండాకు తిరుగులేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దాసరి మనోహర్ రెడ్డి గెలుపు లాంఛనమే అని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.