• మీ ఇంటి మనిషిగా ఆదరించండి
  • జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి
  • సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం
  • ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు
  • ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ
  •  శివకోటి యాదవ్ సమక్షంలో పార్టీలో చేరికలు

వేద న్యూస్, వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట:
బీసీ బిడ్డగా వస్తున్న తనను ఆదరించాలని జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన సమక్షంలో నర్సంపేట పట్టణంలో జనసేన కార్యాలయంలో పార్టీలో యువతీ యువకులు, మహిళలు చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన నియోజవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన యువతీ యువకులు, మహిళలు పార్టీలో చేరినట్లు మెరుగు ప్రకటించారు. పార్టీలో చేరిన వారందరికీ శివకోటి యాదవ్ జనసేన పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నియోజవర్గంలో రాజకీయ పరిస్థితులపై మీడియాతో ఆయన మాట్లాడారు.

అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడంలో ప్రతిపక్షనేత విఫలం: మెరుగు

బీసీ బిడ్డగా వస్తున్న తనను ఇంటి మనిషిగా ఆదరించాలని జనాన్ని అభ్యర్థించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. నర్సంపేట నియోజవర్గాన్ని 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నాయని, సంపూర్ణ అభివృద్ధికి నియోజకవర్గం నోచుకోలేదని వివరించారు. అధికార పార్టీ నేతల భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండ కట్టడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విఫలం చెందారని, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజల్లోకి వచ్చి హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తూ, యువతను ప్రలోభాలకు గురిచేస్తూ అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పెడదోవ పట్టిస్తున్నారన్నారు. ఒక జెండా, ఎ జెండా లేకుండా ఎన్నికల సమయంలో స్వలాభం కోసం పార్టీలు మారుతున్న కొంతమంది అధికార, ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గ్రహించాలని కోరారు.

ప్రజా సంక్షేమం కోసం, యువతకు మార్గ నిర్దేశం చేస్తూ, మహిళలకు పార్టీలో సముచిత గౌరవిస్తూ, పార్టీ భావాజాలనికి కట్టుబడి పని చేసేది జనసేన అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ అవతరిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, ఎల బోయిన డేవిడ్, బొబ్బ పృథ్వీరాజ్, వీర మహిళ నాయకురాలు కోల మౌనిక, లహరి, జనసైనికులు రవి, కార్తీక్, అభిషేక్, మిలాన్, విష్ణు, భాస్కర్, ప్రశాంత్ ప్రభాస్, మాస్, వీర మహిళలు మాధవి, శ్యామలత తదితరులు పాల్గొన్నారు.