వేద న్యూస్, మరిపెడ:
కురవిలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ లో సైన్స్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ లో ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫేర్’ను పలువురు సందర్శించారు. విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని, పాఠశాల యాజమాన్యం రవి-కవిత దంపతులను ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్,డాక్టర్ ఆర్ శ్రీనివాస్ తదితరులు ప్రశంసించారు.

ప్రతీ మనిషి జీవితంలో సైన్స్ ఒక భాగమని చెప్పారు. సైన్స్ తోనే దేశం పురోగతి చెందుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.