- నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మునేష్, రమేష్
- మరిపెడ పట్టణ నూతన కమిటీ ఎన్నిక
వేద న్యూస్, మరిపెడ:
నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామని, ఏళ్ల తరబడి వారు పడుతున్న సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తామని మరిపెడ పట్టణ శ్రీరామ నాయిబ్రాహ్మణ నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల మునేష్, ఉప్పల రమేష్ అన్నారు.
శుక్రవారం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఉప్పల సోమయ్య, ఉప్పల సత్యంల ఆధ్వర్యంలో మరిపెడ పట్టణ నూతన కమిటీని మునిసిపాలిటీ కేంద్రంలోని రామాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా గుడిమల్ల యాదగిరి, అధ్యక్షుడిగా మామిడాల మునేష్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పల రమేష్, కోశాధికారి నాగవెల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఉల్లందుల యుగంధర్, సహాయకార్యదర్శులు ఉప్పల మహేష్, ఉబ్బనపల్లి నవీన్, సభ్యులు మామిడాల వెంకన్న, గుడిమల్ల మల్లేషం, ఉల్లేందుల సతీష్, కుమ్మరికుంట్ల యాకయ్య, ఉప్పల రామకృష్ణ లను ఎన్నుకున్నారు.
తమపై నమ్మకం ఉంచి తమను ఎన్నుకున్న సభ్యులకు, తమ ఎన్నికకు సహకరించిన నాయి బ్రాహ్మణ మండల కమిటీ బాధ్యులకు అధ్యక్ష, కార్యదర్శులు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పలమల్లు, సునీల్, నవీన్, గడ్డం నరేష్, అభిరాం, యాకయ్య, పాపులు, శ్రీను, రాములు, మల్లేషం, తదితరులు పాల్గొన్నారు.

