వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీబీవీ జమ్మికుంటలో “నిల్ బట్టే సనాట ” అనే సందేశాత్మక సినిమాను అధికారులు బుధవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు కేజీబీవీలో ఈ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు.

‘‘పనిమనిషి పిల్లలు పని మనుషులుగా కాకుండా కలెక్టర్ కావచ్చు’’ అనే ఇతివృత్తంతో గొప్ప సందేశంతో కూడి ఉన్న సినిమా విద్యార్థులను ఇన్ స్పైర్ చేస్తోందని వెల్లడించారు. అదేవిధంగా పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉన్నట్లయితే గొప్ప విజయాన్ని పొందవచ్చనే సూచన కూడా ఈ చిత్రంలో ఇచ్చారని వివరించారు.

దీనిని పీపుల్ ఫర్ ఇండియా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుండి జి.అరవింద్ వైస్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుప్రియ, ఉపాధ్యాయులు, 210 మంది విద్యార్థినులు పాల్గొని చిత్రాన్ని తిలకించారు.