వేద న్యూస్, వరంగల్ టౌన్:
తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గా యువజన కాంగ్రెస్ తూర్పు అధ్యక్షునిగా చేసిన నిశాంత్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శనివారం నవీన్ రాజ్, నల్గొండ రమేష్ సమక్షంలో నిశాంత్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కానీ తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. విలువ లేని పార్టీలో నిమడలేక తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లోకి చేరడం జరిగిందని అన్నారు. అనంతరం గోపాల నవీన్ రాజు, నల్గొండ రమేష్ మిట్ట నిశాంత్ గౌడ్ సతీమణి ప్రియాంక కి కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.