వేద న్యూస్, మరిపెడ:
స్ఫూర్తి ఎడ్యుకేషనల్&రూరల్ డెవలప్మెంట్ సోసైటీ తెలుగు సేవా సమితి ఆఫ్ నేబ్రాస్క వారి ఆధ్వర్యంలో సోమవారం జెడ్పీహెచ్ఎస్ మరిపెడ పాఠశాలలో ఎన్.ఎం.ఎం.ఎస్ (ఎన్ఎంఎంఎస్ )రాయబోయే ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను అందించారు .
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు ఆనంతరాములు మాట్లాడుతూ స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పేద పిల్లలపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయ్య మాట్లాడుతూ పేద పిల్లలకు అన్ని రకాలుగా సహకారం అందించాలని అటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాలు అందివ్వడం జరుగుతుందని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం 12000 చొప్పున స్కాలర్ షిప్ వస్తుందని చెప్పారు.
కావున విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించాు. పాఠశాలలో స్ఫూర్తి ఎడ్యుకేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు.
పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ కు సహకారం అందించామన్నారు. కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఏడెల్లి పరశురాములు ,ఉపాద్యాయులు బి రామ్ మోహన్,బి స్వప్న కె రమేష్ రెడ్డి కె నెహ్రు.ఎం సురేష్.డి ప్రకాష్, శౌరి ప్రసాదరావు రావు మరియు విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.