- డీఆర్ వోకు నోటీసులు అందజేసిన కౌన్సిలర్లు
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట:
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పై 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాకేంద్రానికి చేరుకుని డీఆర్ వో పవన్ కుమార్ కు కౌన్సిలర్లు శుక్రవారం అవిశ్వాస తీర్మానం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎజెండా తయారు చేసి, చేయని పనులకు బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారని, పట్టణ ప్రగతి నిధులు వార్డులలో చేయని పనులకు రికార్డులు చేయించి డ్రా చేస్తున్నారని అవిశ్వాస తీర్మానంలో పేర్కొన్నారు. 20 మంది కౌన్సిలర్లు కరీంనగర్ కు జమ్మికుంట నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి..అక్కడ అవిశ్వాస తీర్మానం అందజేసి ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.