• ఎమ్మెల్యే, గులాబీ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ధీమా
  • గులాబీ జెండా పేదలకు అండని దాసరి వ్యాఖ్య

వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు:
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారని వెల్లడించారు.

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందని తెలిపారు. బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు.

తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రచారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి , వేముల రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతి – శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మార్కు లక్ష్మణ్, సర్పంచ్ మాదిరెడ్డి భాగ్య లక్ష్మీ, ఎంపీటీసీ మాదిరెడ్డి తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ మామిడి తిరుపతి,మాజీ సర్పంచ్ రామగిరి రమేష్, మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు గాదం శ్రీనివాస్, రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ మామిడి ఓదెలు, యూత్ అధ్యక్షులు కొట్టె శంకర్ ,కొత్త శ్రీధర్, మాదిరెడ్డి చంద్రారెడ్డి, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,సంపత్, వడ్లూరి శ్రీనివాస్, రాజేశం, సారంగం, నరసింహారెడ్డి తోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.