- దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పిలుపు
- చల్లూరును మండలం చేసి తీరుతానని హామీ
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక:
రాజకీయంగా ఎంత ఎదిగినా ఏ పదవిలో ఉన్నా నేను హుజురాబాద్ నియోజకవర్గం బిడ్డగానే ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన వీణవంక మండలంలోని రామకృష్ణపూర్,, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎల్వాక, గంగారం,బొంతుపల్లి, కిష్టంపేట్, హిమ్మత్ నగర్, లక్ష్మక్క పల్లి,కొండపాక,పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ఏర్పాటు చేశారని అన్నారు. దామోదర్ రెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. దామోదర్ రెడ్డి ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మామిడాల పల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తేనే ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.
మామిడాల పల్లిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దామోదర్ రెడ్డి లేని లోటును తీరుస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిఆర్ఎస్ పార్టీ అధినేత చావు నోట్లో తలబెట్టారని వివరించారు. రైతుల కోసం 19 వేల కోట్ల రుణమాఫీ చేశారని 17 కోట్లు ఇప్పటివరకు రుణమాఫీ అయిందని రెండువేల కోట్లు కూడా వారం పది రోజుల్లో అయిపోతుందని వెల్లడించారు.
మిగిలిన రుణమాఫీ నియోజకవర్గంలో ఎవరు ఉన్నా అది పూర్తి బాధ్యత తనది అని హామీనిచ్చారు. ముఖ్యంగా రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు తోపాటు రైతుకు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ కు గత 20 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చినా హుజురాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెలు శ్రీనివాస్ యాదవ్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. దండం పెట్టి, కొంగు పట్టి అడుగుతున్నానని., ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని వెల్లడించారు. కౌశిక్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మా ఇంట్లో కంటే ఎక్కువ మీతోనే ఉన్నారని అన్నారని, హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నాడని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు.
కౌశిక్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపల్లి బీజేపీ నాయకుడు మిడిదొడ్డి అనిల్, వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామా ఉప సర్పంచ్ దూడపాక రాజకొమురయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.