- నిబంధనలకు విరుద్ధంగా డీజే లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
- వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్
వేద న్యూస్, వే ములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిజే యజమా నులతో పోలీసులు సమావేశమయ్యారు. డి.జే యజమానులు పోలీస్ వారి సూచనలు బేఖాతరు చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటా మని పోలీసు లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు నిర్వహించిన యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ,శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డి.జే యజమానులతో పాటుగా నిర్వహకులపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గణేష్ మండపాల వద్ద పోలీస్ అధికారుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని.. అదికూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అని చెప్పారు.
అధిక శబ్దాలు చేసే డి.జే ల వలన చిన్న పిల్లలు,విద్యార్థుల చదువుకు, వృద్ధులు ఆరోగ్యనికి ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో డి.జే నిర్వహకులపై డయల్100 కాల్స్ వస్తున్నాయని వేములవాడ పట్టణ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో డిజే లకు అనుమతి లేదు అని స్పష్టం చేశారు.