వేద న్యూస్, వరంగల్ టౌన్ :

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన మంతూర్తి శ్రీనివాస్ – స్వప్న దంపతుల కుమార్తె ” మంతూర్తి సాన్విక ” పుట్టినరోజు సందర్భంగా మంతూర్తి శ్రీనివాస్ – స్వప్న దంపతుల సహకారంతో ములుగు రోడ్డు, హనుమకొండ లోని స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు 413వ రోజు ఆశీర్వాద భోజనం అన్నదాన (అన్న ప్రసాదం) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంతూర్తి శ్రీనివాస్ – స్వప్న, మంతూర్తి సాన్విక, మంతూర్తి రియాన్షి, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, కోలా రాజేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్, అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్, ఊరటి రవికుమార్, సృజన, జ్యోతి, భావన, బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు, ఎస్.కె ముస్తఫా, లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్), యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము, సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్, మోడెం రాజశేఖర్ గౌడ్, నాగవెళ్ళి కార్తిక్ తదితరులు పాల్గొనడం జరిగింది.