వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ నగరంలోని కాశికుంటలో భారీ వర్షం కారణంగా విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఓ ఇంట్లోకి నీరు చేరడంతో, కింద నిద్రపోతున్న 80 ఏళ్ల వృద్ధురాలు పసునూరి బుచ్చమ్మ నీటిలో మునిగి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Oplus_16908288