- ఎల్బీ కాలేజీ ఎన్సిసి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన
- కాలేజీ ప్రాంగణం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా జనానికి అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రపంచాన్ని నేడు పట్టిపీడిస్తున్న అవినీతి క్యాన్సర్ కంటే ప్రమాదమని చెప్పారు. అవినీతి రహిత పాలన అందేయడానికి పౌరులందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
మనదేశంలో ప్రజల్లో అవగాహన కల్పించడమే ఎన్సిసి కేడెట్స్ చైతన్య ర్యాలీ ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. ప్రతీ వారు అవినీతికి పాల్పడకుండా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించినప్పుడు దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని..ప్రతీ పౌరుడు ఈ ‘‘దేశం నాది’’ అనే సంకల్పంతో దృఢ నిర్ణయంతో ఉంటే అవినీతిని దానికి పాల్పడే అధికారులను నియంత్రించడం చాలా సులభమని ప్రిన్సిపాల్ వివరించారు.
అవినీతికి పాల్పడ్డ, అవినీతిని ప్రోత్సహించిన కఠినంగా శిక్షించాలని ఎన్సిసి క్యాడెట్స్ ఎల్బీ కాలేజీ నుంచి నుంచి వేయి స్తంభాల గుడి, అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ ఎం సదానందం, జూనియర్ అండ్ ఆఫీసర్స్ పవన్, జూనియర్ అండ్ ఆఫీసర్ రాము నాయక్, రజనీకాంత్ ,అఖిల్ ఎన్సిసి క్యాడెట్స్ పాల్గొన్నారు.