వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అవయవదానం గొప్పదానం అని పలువురు పేర్కొన్నారు. సదాశయ ఫౌండేషన్, ప్రగల్లపాటి ప్రకాశం ఫౌండేషన్ బాధ్యులు శ్రవణ్ కుమార్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా నివాసులు పుల్లికండం మంజుల(టీచర్), కాజీపేట పురుషోత్తం(విశ్రాంత అటవీ శాఖాధికారి) దంపతులు శనివారం..తమ మరణానంతరం శరీర దానం చేయడానికి ముందుకు వచ్చారు. సంబంధిత పత్రాలపై వారు సంతకాలు చేసి నిర్వాహకులకు ఇచ్చారు.
ఇంతవరకు అనేక సామాజిక సేవా సంస్థల భాధ్యులుగా ఉండి సమాజహితులుగా పేరు గాంచిన పురుషోత్తం-మంజుల దంపతులు శరీరదానానికి ముందుకు రావడం ఆదర్శం, స్ఫూర్తి దాయకమని పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు దేవాచారి, షిరాజుద్దీన్, పరుశరాములు, వేణు, నరేష్, రాజయ్య, రవిబాబు, దామోదర్ తదితరులు అభినందించారు.