వేద న్యూస్, వరంగల్:
ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌లోని బికనీర్ మహరాజ గంగా సింగ్ వర్సిటీలో ‘స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ నుంచి ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఎన్జీవో(OWLS-NGO) సంయుక్త కార్యదర్శిగా పర్యావరణవేత్త పిట్టల రవిబాబు హాజరయ్యారు.
నేషనల్ పానెల్ ఆఫ్ స్పీకర్స్‌లో ఒకరిగా ఆయన ప్రసంగించారు. ‘పర్యావరణ విద్య, అవగాహన, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో ఎన్జీవోల పాత్ర’ అనే అంశంపై రవిబాబు పేపర్ సబ్మిట్ చేశారు. పరిమితమైన వనరులను వినియోగించుకుని, అపరిమితమైన ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ఆలోచన చేయాలన్నారు. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణలో ఎన్జీవోల పాత్ర అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ సదస్సులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కీలకమైన విషయాలపై ప్రసంగించడం తనకు సంతోషాన్ని కలిగించిందని పిట్టల వెల్లడించారు. ఇందుకు అన్నివిధాలా సహకరించిన ఔల్స్ ఎన్జీవో వ్యవస్థపాక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్‌రావుకు, వ్యవస్థపాక కార్యదర్శి చెల్పూరి శ్యామ్ సుందర్‌కు, ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించిన సదస్సు ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పర్యావరణ టాక్సికాలోజిస్ట్, ఆర్.ఆర్.సీ. అల్వార్, రాజస్థాన్ ప్రొ.మమతాశర్మకు, తనకు ఆతిథ్యమిచ్చిన సదస్సు చైర్ పర్సన్, పర్యావరణ శాస్త్ర విభాగ అధిపతి, డీన్ ఫాకల్టీ అఫ్ సైన్స్, మహరాజ గంగా సింగ్ యూనివర్సిటీ, బికనిర్ ప్రొ.అనిల్ కుమార్ చ్ఛాంగానికి ధన్యావాదాలు తెలిపారు.
తనతో పాటు సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, సహకరించిన అందరికీ రవిబాబు థాంక్స్ చెప్పారు. సదస్సు నిర్వాహకులు తమ రాజస్థానీ సంస్కృతిలో తనను సత్కరించినందుకు సంతోషం కలిగిందని చెప్పారు. కాన్ఫరెన్స్ జాతీయ ప్యానలిస్టుగా పరిశోధనా పత్రాలను సమర్పించిన ముఖ్య వక్తలు, ప్రతినిధులను తాను సత్కరించినట్టు స్పష్టం చేశారు.
