వేద న్యూస్, వరంగల్:

వన్యప్రాణులకు ప్రశాంతత, నిర్మలమైన, చెదిరిపోని ఆవాసాలు.. ఫొటోగ్రాఫర్‌ల స్వర్గం.. అందానికి ఒక ఎనిగ్మా, ప్రకృతి ప్రేమికులకు వర్చువల్ స్టోరీ టెల్లర్.. పక్షి ప్రియులకు హాట్‌స్పాట్.. పిల్లల కోసం ఒక ఆచరణాత్మక అభ్యాస పాఠశాల.. అందమైన అటవీ ఆవాసం. అలాంటి అందమైన ప్రకృతి ఆవాసమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో.. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఓల్స్) టీమ్ సభ్యులు, పార్టిసిపెంట్స్ ఆహ్లాదకరంగా టైం స్పెండ్ చేశారు.

కవాల్ టైగర్ రిజర్వ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో బైసోంకుంటలో నిర్వహించిన 3వ బర్డ్‌వాక్ కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా డీఎఫ్‌వో ఆశిష్, ఎఫ్ఆర్వో సుష్మా రావు, డీఆర్వో తిరుపతి, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, వాచర్స్, ఇతర ఫారెస్ట్ సిబ్బంది, ఇందారం నాగేశ్వరరావు సహకారంతో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు ఇతర పార్టిసిపెంట్స్ కవ్వాల్ టైగర్ రిజర్వును సందర్శించారు. తాము ఈ ఫారెస్ట్‌ను సందర్శించి చాలా విషయాలు నేర్చుకున్నామని సభ్యులు వెల్లడించారు. తమకు అవకాశం కల్పించిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలిపారు.