• డాక్టర్ చదువుకు ఏటా 25 వేలు ప్రోత్సాహం 
  • పేద విద్యార్థులకు అండగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి 
  • ప్రజాసేవలో యువ నాయకుడు

 

వేద న్యూస్, జమ్మికుంట: 

 పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామానికి చెందిన తడిగొప్పుల తిరుపతికి చిన్నతనంలోనే పోలియో వచ్చి ఎడమ చేయి పడిపోయింది ఆయన భార్య సుజాతకు ఇద్దరు కూతుళ్లు ఆశ్రిత, ఇందు ఉన్నారు వీరిది రేక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఆశ్రిత చదువు మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి ఎలాగైనా డాక్టర్ కావాలని కష్టపడి చదివి 2022వ సంవత్సరంలో నీట్ లో మంచి ర్యాంక్ సాధించి మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది.

తనా డాక్టర్ చదువు ఎలాగైనా కొనసాగించాలని ఉద్దేశంతో పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని కలిసి తనా తండ్రి పరిస్థితిని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి డాక్టర్ చదువు పూర్తయ్యే వరకు 5 సంవత్సరాలు వరకు నీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంబిబిఎస్ రెండవ సంవత్సరంలో ఖర్చుల కొరకు వీణవంక గ్రామంలోని తమ సిబ్బందితో 25,000 వేల రూపాయలను అందజేశారు.ఆశ్రిత మాట్లాడుతూ

పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని తాను కూడా ఉన్నత శిఖరాలను చేరుకొని, సమాజ సేవ చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో

 వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్,సమిడ్ల ప్రకాష్, దసారపు లోకేష్, తాళ్లపెల్లి కుమారస్వామి, నాని, తోట్ల రాకేష్, బూర్గుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.