వేద న్యూస్,మిర్యాలగూడప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘం భవనంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలుగు నూతన సంవత్సర ఉగాది రోజున పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.ఆయా రాశుల ఆదాయ వ్యయాలు లాభ నష్టాలు క్లుప్తంగా వివరించారు.వ్యవసాయం,పారిశ్రామిక రంగం విద్యా,వైద్యo,యువకులు, విద్యార్థులు,మహిళలు, ఉద్యోగులు,కార్మికుల రాశి ఫలాలను వివరించారు.ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ భావండ్ల పాండు మాట్లాడుతూ పద్మశాలి లు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలన్నారు. కొత్త సంవత్సరంలో పద్మశాలిలకు మంచి జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాపోలు వెంకటేశ్వర్లు,అధ్యక్షులు జిల్లా రాంబాబు,ప్రధాన కార్యదర్శి రామ ప్రసాద్,మిరియాల కృష్ణయ్య,కోడి జనార్దన్,మారం శ్రీనివాస్,మారం రంబాయమ్మ పాల్గొనగా పంచాంగ శ్రవణము తీర్థ ప్రసాదములు స్వీకరించారు.