వేద న్యూస్, హైదరాబాద్:

 హైదరాబాద్ లోని టి ఎన్ జి ఓ భవన్ లో టి ఎన్ జి ఓ స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ , ప్రధాన కార్యదర్శి ముజీబ్  ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల రాష్ర్ట ఫోరంను శనివారం ఎన్నుకున్నారు.

  ఫోరం రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులుగా ఎం డీ. రఫీ(ఐనవోలు), జాయింట్ సెక్రటరీగా బి.వెంకటేశం(బీమదేవరపల్లి)  ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అర్షం శ్రీనివాస్(దామెర) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఈ ఎన్నికకు సహాకారం అందించిన టి ఎన్జీవో స్ యూ నియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు  ఆకుల రాజేందర్ కు,ములుగు జిల్లా అధ్యక్షులు పోలు రాజు కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర ఫోరానికి ఏ కగ్రీవంగా ఎన్నికైన వారికి హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జనుగాని అశోక్,ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,ఉపాధ్యక్షులు వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు.