• ట్రెజరీలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
  • జీపీలకు ఫండ్స్ కేటాయించాలి.. కేడర్ స్ట్రెంత్ పెంచాలి
  • గ్రేడ్ 1,2,3,4 ఖాళీలను గుర్తించాలి.. రెండేండ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరకీ ప్రమోషన్లు కల్పించాలి
  • ఓపీఎస్ లను జేపీఎస్ లు గా రెగ్యులరైజ్ చేయాలి
  • ఇతర ఉద్యోగుల వలె సెక్రెటరీలకు నిర్దిష్టమైన పనివేళలు నిర్ణయించాలి

వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్  భవన్ లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జనుగాని అశోక్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. మీటింగ్‌లో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించి తీర్మానాలు  చేశారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్  యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయి పంచాయతీ కార్యదర్శుల సమస్యలను టీఎన్జీవోస్  కేంద్ర సంఘం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటకు కృషి చేస్తానని తెలిపారు.

ట్రెజరీ‌లో ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, గ్రామ పంచాయతీ లకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. జేపీఎస్ ల నియామక తేదీ నుంచి సర్వీస్ లెక్కిస్తూ.. రెగ్యులరైజ్ కాలాన్ని నాలుగేండ్ల నుంచి రెండేండ్లకు తగ్గించి ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని, అన్ని జీపీలకు ఫండ్స్ కేటాయించాలి.. కేడర్ స్ట్రెంత్ పెంచాలి.. కేడర్ కేటాయించాలని, గ్రేడ్ 1,2,3,4 ఖాళీలను గుర్తించాలి.. రెండేండ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరకీ ప్రమోషన్లు కల్పించాలని, ఓపీఎస్ లను జేపీఎస్ లు గా రెగ్యులరైజ్ చేయాలని, ఇతర ఉద్యోగుల వలె సెక్రెటరీలకు నిర్దిష్టమైన పనివేళలు నిర్ణయించాలని మీటింగ్ లో తీర్మానాలు చేశారు.

కార్యక్రమంలో టీెఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సోమన్న,గౌరవ అధ్యక్షుడు శ్యామ్ ,కేంద్ర సంఘం సభ్యులు లక్ష్మీ ప్రసాద్,మోయీజ్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎండీ. రఫీ,జాయింట్ సెక్రెటరీ వెంకటేశం,ఈ.సి.మెంబర్ ఆర్శం శ్రీనివాస్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వెంకన్న గౌడ్,కోశాధికారి రాయకంటి రాజు, ఉపాధ్యక్షులు మనోహర్, కిషోర్,జాయింట్ సెక్రటరీ లు లావణ్య,భాస్కర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ లు శివ శంకర్, ప్రవళిక,ఈ.సి.మెంబర్ రఘు,హనుమకొండ డివిజన్ అధ్యక్షులు యాదగిరి,పరకాల డివిజన్ అధ్యక్షులు వేణు మాధవ్,కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.