వేద న్యూస్, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లాలో కేజీ విల్స్ తో రోడ్లు పై ట్రాక్టర్లు తిరగరడం నిలిపి వేయాలి అని ప్రకటనల వారికే తప్ప ఆచరణలో ఏలాంటి మార్పు లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో యదేచ్చగా కొంత మంది ట్రాక్టర్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా కేజీ వీల్స్ తో రోడ్ల పైన ట్రాక్టర్లను నడుపుతున్నారు.

 

అందువల్ల గత కొన్ని రోజుల క్రితం స్వయంగా పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వయంగా ప్రకటన చేసినప్పటికీ ఆదేశాలను కొంతమంది నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారు. పత్రిక ప్రకటనలకు మాత్రమే చర్యలు ఉంటాయని చెప్పడం తప్ప ఆచరణలో ఎలాంటి పురోగతి కనబడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు చేసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లపై తిరిగే కేజీ వీల్స్ ట్రాక్టర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.