కలెక్టర్ కోయ శ్రీ హర్ష

వేద న్యూస్, పెద్దపల్లి :

శ్రాఖీ పండుగ వంటి స్థానిక సంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష కు సంక్షేమ శాఖ లోనే అంగన్వాడీ టీచర్లు మహిళా సిబ్బంది రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పంచినప్పటికీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు అది సరిగ్గా స్వీకరించక పోవడానికి పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత పై ప్రజలలో అవగాహన లోపం ప్రధాన కారణంగా గమనించామని అన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ప్రజలు ప్రభుత్వ పథకాలను స్వీకరించడం లో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని, బలహీనంగా ఉన్న పిల్లలు సాధారణ స్థితికి చేరుకోవడానికి అంగన్వాడీల ‘బాలామృతం’, ‘బాలామృతం ప్లస్’ వంటి పోషకాహార పొట్లాలను తల్లిదండ్రులకు అందజేసినా, వాటిని పిల్లలకు సరిగ్గా ఇవ్వడం లేదని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. శ్రీ ఈ సమస్యను అధిగమించేందుకు **పోషణ బంధం’* పేరిట రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేక ‘పోషణ రాఖీలు’ తయారు చేయించి, వాటిని జిల్లాలోని అన్ని అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశామని, ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని గర్భిణీ స్త్రీలు 2, బాలింతలు, పిల్లల ఇళ్లకు స్వయంగా వెళ్లి, ఆ ఇంటిలోని పురుషులకు రాఖీ కట్టి, పోషకాహారం యొక్క అవసరాన్ని వివరిస్తారని అన్నారు. శ్రీ అంగన్వాడీలలో అందించే పూర్వ ప్రాథమిక విద్య , ఒకపూట పూర్తి భోజనం, ‘బేటి బచావో, బేటి పడావో’ పథకం కింద బాలికల విద్య, సంక్షేమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని, వారి పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీకి పంపాలని కోరతారని, జిల్లాలో దాదాపు 15000 గృహాలకు ఋ ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు వెళ్ళి చైతన్యం కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు. పోషణ బంధం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.