వేద న్యూస్, జమ్మికుంట:
గత నెల 30న అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ కోసం స్వగ్రామం బాట పట్టిన జనం మళ్లీ నగరానికి తిరుగు పయనమవుతున్నారు. శనివారం రాష్ట్రరాజధాని హైదరాబాద్ చేరుకునేందుకు జమ్మికుంట మండల పరిధిలోని ప్రజలు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర సంస్థల్లో పని చేసే ప్రైవేటు ఉద్యోగులు జమ్మికుంట రైల్వే స్టేషన్ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రైలు కోసం బారులు తీరారు. ట్రైన్ కిక్కిరిసి పోయేలా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని రైల్వే స్టేషన్ సిబ్బంది తెలిపారు.
