• జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ:

దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) కార్యక్రమం లో భాగం గా మంగళవారం వరంగల్ జిల్లా పరిధి ఐ ఎం ఎ హల్ లో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లకు ఓటు హక్కు వినియోగం పై ఏర్పాటు చేసిన చేసిన అవగాహన కార్యక్రమానికి కమీషనర్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏ.ఆర్. ఓ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయడానికి దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్ ల ఏర్పాటు ప్రత్యేక క్యు లైన్లు తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

వరంగల్ తూర్పు నియోజక వర్గంలో సుమారు 12 వేల మంది దివ్యాంగ ఓటర్ లు ఉన్నారని, ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని, ఫాం-8 సమర్పణ ద్వారా పిడబ్ల్యుడి మార్కింగ్ ఇవ్వాలని, దివ్యాంగులు 12(డి)సమర్పించి హోం ఓటింగ్ నమోదు చేయించుకొని ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భం గా దివ్యాంగ ఓటర్లచే ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, టి పి ఆర్ ఓ రాజేష్ కుమార్, తహశీల్దార్ ఇక్బాల్, టి ఎం సి రమేష్, దివ్యాంగ నాయకులు బండి రాజేందర్, చక్రపాణి, వాణి, సి ఓ లు తదితరులు పాల్గొన్నారు.