- మంత్రి పొన్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం, మాజీ ఎమ్మెల్యే సతీశ్, వొడితల ప్రణవ్..
వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రజాప్రతినిధులు సోమవారం దర్శించుకున్నారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ వొడితల, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో పి.కిషన్ రావు, అధికారులు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులందరికీ స్వామి వారి ఫొటోతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ముఖ్య అర్చకులు రాంబాబు పూర్ణకుంభంతో ప్రజా ప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు.