–ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ అరుదైన రికార్డు
–వరుసగా ఐదోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపిక
వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ ప్రధాన పత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ ఫొటోగ్రఫీ రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వరుసగా ఐదోసారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపికై రికార్డు సృష్టించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గ్రీన్ ల్యాండ్స్ హోటల్ లో
ఈనెల 19న సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రతాప్ అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపికైన ప్రతాప్ ను
జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు అభినందించారు.