•  అమృత్ సరోవర్ స్కీమ్‌కు ఈరయ్య చెరువు ఎంపిక

వేద న్యూస్, హన్మకొండ:
దామెర మండలకేంద్రంలోని ఈరయ్య చెరువు అమృత్ సరోవర్ పథకంలో భాగంగా ఎంపిక అయినందున చెరువు కట్ట వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సారంగం, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.