వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఉగాది పర్వదినం (విశ్వావసు నామ సంవత్సర యుగ ఆది) రోజున కొండపాక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఆదివారం నిర్వహించారు.
కార్యక్రమంలో కాపు సంఘం కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కమిటీ కార్యవర్గ సభ్యులు, కుల బంధువులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు. వేప ఆకులతో పాటు వస్తవులతో మహిళలు బోనం మెత్తుకుని పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. పండుగ పూట పోచమ్మ వారికి బోనాలు సమర్పించడం ఆనందంగా ఉందని పలువురు గ్రామస్తులు, భక్తులు పేర్కొన్నారు.