ఓ మనిషీ…!
నీ స్వార్ధం మానుకో…!
ఇకనైనా నీ వైనం మార్చుకో…!
నిస్వార్ధంగా జీవించడం నేర్చుకో…!

ప్రకృతిని, పంచ భూతాలను చెరబట్టకు…!
నీ స్వార్థం కోసం ఒకేసారి సహజవనరులను
డబ్బు రూపంలోకి మార్చకు…!

నీ సామాన్య జీవనానికి
అవసరమైనంత మాత్రమే
ప్రకృతి ప్రసాదించిన
సహజ వనరులను వాడుకో…!

లేదని నీ పంతం మార్చుకోకపోతే,
ఇదిగో నా ప్రకాపంలో కనుమరుగైపోతావు…!

నీ తోపాటు నీ చుట్టు ఉండే
అమాయక నిర్జీవ వనరులను,
సజీవ జీవజాతులు నీతోపాటు బలియావుతాయి…!

ఇది నిప్పులాంటి నిజం…
నీ కనులముందే సాక్షాలతో సహా,
ఇదిగో ఇలా హెచ్చరికలు ఇస్తూనే ఉంది…!!

ఇకనైనా నీ స్వార్ధం మానుకో…!
సహజసిద్ద సానుకూలంగా జీవించడం నేర్చుకో..!

లేదంటే నీ ఉనికిని,
మనుగడనే మార్చేస్తుంది నీ దాష్టికాలు చూడ లేక

అవసరమైతే నిన్నే మింగేస్తుంది
ఈ ప్రకోపించిన ప్రకృతి,

పంచాభూతాల ప్రకోప
ప్రళయ నృత్యమృత్యువును
భరించలేక కనుమరుగవుతావు…!!!!

కాదంటే ప్రకతి ప్రకోపానికి
గజగజా వణుకుతూ…
కాలగర్భంలో కనుమరుగవుతావు
కానులారా చూస్తూ…!

ఇక మారుతావో కనుమరుగవుతావో నీ ఇష్టం
ఇక కాచుకో…!!

ఓ మనిషీ…!
నీ స్వార్ధం మానుకో…!
ఇకనైనా నీ వైనం మార్చుకో…!
నిస్వార్థంగా జీవించడం నేర్చుకో…!

– రవి బాబు పిట్టల, పర్యావరణవేత్త,
– సంయుక్త కార్యదర్శి, ఔల్స్(Owls) ఎన్జీవో , హైదరాబాద్, తెలంగాణ, భారత్.