రాలిపోయిన పువ్వు..
చెట్టుకు సొంతమా..
భూమికి సొంతమా?
చెట్టుకే సొంతం అనుకుంటే..
రాల్చుడు న్యాయమేనా?
భూమికి సొంతం అనుకుంటే..
చెట్టుకు ఇచ్చుడెందుకు?
లేదు ఇదంతా ప్రకృతి చక్రం అనుకుంటే..
రాలిన పువ్వులది త్యాగమా?
కాలగమనంలో భాగమా?
పువ్వుల సంగతి అటుంచితే..
ఇంతకీ నీ సంగతేంది?
నువ్వు ఎవరు? నీ వారెవరు?
నువ్వు ఎవరి సొంతం..? ఎవరిది పంతం?
ఎప్పుడైనా ఆలోచించినవ?
ఓసారి ఆలోచన చెయ్..!
– ఎం.వెంకట్‌రెడ్డి,
నల్లగొండ.
